Share News

ఉద్యోగం మారుతున్నారా..?

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:37 AM

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఈ మధ్యనే తన సాంకేతిక వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు క్లెయిమ్‌ల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇకపై ఉద్యోగం మారే సమయంలో...

ఉద్యోగం  మారుతున్నారా..?

పీఎఫ్‌ బదిలీ విషయంలో ఈ తప్పులు జరగకుండా చూసుకోండి..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఈ మధ్యనే తన సాంకేతిక వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు క్లెయిమ్‌ల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇకపై ఉద్యోగం మారే సమయంలో మీ ప్రావిడెండ్‌ ఫండ్‌ (పీఎ్‌ఫ)ను కొత్త కంపెనీకి బదిలీ చేసే ప్రక్రియ గతంలో కంటే వేగంగా జరగనుంది. అయితే, తప్పుడు సమాచారాన్ని ఏ ఆధునిక టెక్నాలజీ కూడా పరిష్కరించలేదు. ఒకవేళ మీ వ్యక్తిగత వివరాలు సరిపోలకపోయినా, మీ కేవైసీ (కస్టమర్‌ వ్యక్తిగత వివరాల ధ్రువీకరణ) ప్రక్రియ పూర్తి కాకపోయినా లేదా కంపెనీ యాజమాన్యం మీ వివరాలను సరిగా అప్‌డేట్‌ చేయకపోయినా పీఎఫ్‌ బదిలీ జాప్యమవుతుంది. కాబట్టి, ఈ తప్పులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.

వ్యక్తిగత వివరాలు సరిపోల్చుకోండి..

పీఎఫ్‌ బదిలీ జాప్యానికి ఉద్యోగి వ్యక్తిగత వివరాల్లో అసంబద్ధత అతిపెద్ద కారణం. పీఎఫ్‌ ఖాతా (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌-యూఏఎన్‌), ఆధార్‌, పాన్‌లోని మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాల్లో పోలిక లేకపోతే ఈపీఎ ఫ్‌ఓ మీ పీఎ్‌ఫను ఆటోమెటిక్‌గా బదిలీ చేయలేదు. పేరు, ఇతర వివరాల్లో చిన్న అక్షర దోషం లేదా అటుఇటుగా ఉన్నా అదనపు ధ్రువీకరణ అవసరమవుతుంది. కాబట్టి, ఉద్యోగం మారే సమయంలో యూఏఎన్‌, ఆధార్‌, పాన్‌లో మీ వ్యక్తిగత వివరాలు ఒకేలా ఉన్నాయా..? లేదా..? అని తప్పక పరిశీలించండి. అన్నింటిలోనూ వివరాలు ఒకే విధంగా లేకపోయినా, తప్పులున్నా వెంటనే సరిచేసుకోండి.

రెండో యూఏఎన్‌.. వద్దే వద్దు..

ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త పీఎఫ్‌ ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా ఈపీఎ్‌ఫఓ చాలా ఏళ్ల క్రితమే యూఏఎన్‌ను ప్రవేశపెట్టింది. అంటే, మీ కెరీర్‌లో ఎన్ని ఉద్యోగాలు మారినా యూఏఎన్‌ మాత్రం మారదు. ఉద్యోగం మారే సమయంలో యూఏఎన్‌ను కొత్త కంపెనీకి బదిలీ చేస్తారు. అయితే, కొన్నిసార్లు ఉద్యోగి కొత్త కంపెనీకి మారినప్పుడు ఆ యాజమాన్యం తొందరపాటు లేదా సమాచార లోపం లేదా ఇతర కారణం వల్లనో కొత్త యూఏఎన్‌ను కేటాయించిన పక్షంలోనూ పీఎఫ్‌ బదిలీ ఆలస్యమవుతుంది. ఎందుకంటే, ఈపీఎ్‌ఫఓ ఆ రెండు ఖాతాలను పరిశీలించి, వ్యక్తిగత వివరాలు సరిపోల్చి విలీనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి, కొత్త కొలువులో చేరేటప్పుడు ఆ యాజమాన్యానికి మీ ప్రస్తుత యూఏఎన్‌ వివరాలను ముందే అందజేయండి.


శీఘ్రం శుభకరం.. ఆలస్యం అనర్థం

కొత్త కంపెనీలో చేరగానే తమ పీఎఫ్‌ సొమ్ము కూడా ఆటోమెటిక్‌గా బదిలీ అవుతుందని చాలా మంది ఉద్యోగులు భావిస్తుంటారు. కానీ, బదిలీ ప్రక్రియను మీ కొత్త యాజమాన్యం వెంటనే ప్రారంభించేలా జాగ్రత్త పడండి. కొత్త ఉద్యోగంలో చేరగానే ఆ కంపెనీలోని సంబంధిత డిపార్ట్‌మెంట్‌తో వాకబు చేయండి.

బదిలీకి ముందే కేవైసీని పూర్తి చేయండి..

పీఎఫ్‌ బదిలీ అభ్యర్థనకు ముందే మీ ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ అకౌంట్‌ను యూఏఎన్‌తో అనుసంధానించడం మరవకూడదు. లేదంటే, ఈ రికార్డులు అప్‌డేట్‌ అయ్యే వరకు పీఎఫ్‌ బదిలీ కూడా నిలిచిపోతుంది. కాబట్టి, బదిలీ ప్రక్రియ నిలిచిపోక ముందే కేవైసీ పూర్తి చేయడం మేలు. సులభం కూడా.

మీ గత యాజమాన్యాన్నీ వాకబు చేయండి..

ఈపీఎ్‌ఫఓ వ్యవస్థ మరింతగా ఆధునికీకరించబడినప్పటికీ, ఉద్యోగి పీఎఫ్‌ బదిలీ విషయంలో ఇప్పటికీ పాత, కొత్త కంపెనీల యాజమాన్యాలదే ముఖ్య భూమిక. మీ పాత కంపెనీ యాజమాన్యం మీరు ఉద్యోగం వీడిన తేదీని అప్‌డేట్‌ చేయకపోయినా లేదా వేతనం, తదితర రికార్డుల్లో ఏవైనా తప్పులున్నా బదిలీ ఆలస్యం కావచ్చు. కాబట్టి, ఉద్యోగం వీడే ముందు మీ ఎంప్లాయ్‌మెంట్‌ వివరాలను పూర్తిగా కనుక్కోండి. ఉద్యోగం మారే సమయంలో పీఎఫ్‌ బదిలీ సంబంధించి గత కంపెనీలోని సంబంధిత విభాగంతో వాకబు చేయడం కూడా మేలు.

కొన్ని జాప్యాలు తప్పవు..

అన్నీ సక్రమంగా ఉన్నా.. ఒకే సమయంలో భారీగా దరఖాస్తులు దాఖలు కావడం, సిస్టమ్స్‌ అప్‌గ్రేడ్‌ వంటి కొన్ని సందర్భాల్లోనూ పీఎఫ్‌ బదిలీ జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో మీ అప్లికేషన్‌ స్టేట్‌సను ఈపీఎ్‌ఫఓ పోర్టల్‌లోకి లాగినై చెక్‌ చేసుకోండి. ఒకవేళ అదనపు సమాచారాన్ని కోరితే తగిన వివరాలతో వెంటనే స్పందించండి.

ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి

Updated Date - Jul 26 , 2026 | 03:37 AM