ఎంటార్ టెక్ లాభం 44 కోట్లు
ABN , Publish Date - May 13 , 2026 | 02:09 AM
ఎంటార్ టెక్నాలజీస్.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.306.10 కోట్ల రెవెన్యూపై రూ.44.3 కోట్ల నికర లాభాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎంటార్ టెక్నాలజీస్.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.306.10 కోట్ల రెవెన్యూపై రూ.44.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 67.2 శాతం పెరగగా లాభం 222.3 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంగా గణనీయంగా ఆర్డర్లను దక్కించుకోవటంతో పాటు ఆదాయాల్లో మెరుగైన వృద్ధిని సాధించటం కలిసి వచ్చిందని కంపెనీ తెలిపింది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.876.20 కోట్ల ఆదాయంపై రూ.94 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత