నాగ్‌పూర్‌లో ఎంబ్రాయర్ విమానాల తయారీ ప్లాంట్
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:38 AM
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎంబ్రాయర్ సీ-390 మిలీనియం ఎయిర్‌క్రా్‌ఫ్టల ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ ఏర్పాటు కానుంది....
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎంబ్రాయర్ సీ-390 మిలీనియం ఎయిర్‌క్రా్‌ఫ్టల ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ ఏర్పాటు కానుంది. భారత వైమానిక దళం నుంచి 60 మల్టీ రోల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రా్‌ఫ్ట (ఎంటీఏ)ల కాం ట్రాక్టును దక్కించుకునేందుకు బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ ఈ మధ్యనే మహీంద్రా గ్రూప్‌తో జట్టు కట్టింది. ఒకవేళ ఈ కాంట్రాక్టు దక్కితే, ఎయిర్‌ఫోర్స్‌కు సరఫరా చేయాల్సిన సీ-390 విమానాలను భారత్‌లోనే తయారు చేసేందుకు నాగ్‌పూర్‌లో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పా టు చేయాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
ఇవీ చదవండి:
స్కూల్ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!