Share News

ఇమామీ చేతికి హైదరాబాద్‌ కంపెనీ

ABN , Publish Date - May 08 , 2026 | 01:43 AM

ఎఫ్‌ఏంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్‌.. హైదరాబాద్‌కు చెందిన బ్యూటీ, స్కిన్‌ కేర్‌ సంస్థ ఇంక్‌నట్‌ డిజిటల్‌లో 60 శాతం వాటాను రూ.321 కోట్లకు కొనుగోలు...

ఇమామీ చేతికి హైదరాబాద్‌ కంపెనీ

ఇంక్‌నట్‌లో 60 శాతం వాటా.. డీల్‌ విలువ రూ.321 కోట్లు

కోల్‌కతా:ఎఫ్‌ఏంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్‌.. హైదరాబాద్‌కు చెందిన బ్యూటీ, స్కిన్‌ కేర్‌ సంస్థ ఇంక్‌నట్‌ డిజిటల్‌లో 60 శాతం వాటాను రూ.321 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్‌తో ఇంక్‌నట్‌కు చెందిన పర్సనలైజ్డ్‌ స్కిన్‌కేర్‌, హెయిర్‌కేర్‌ బ్రాండ్లు వేదిక్స్‌, స్కిన్‌క్రా్‌ప్ట ఇమామీ చేతికి రానున్నాయి. ఇంక్‌నట్‌ కొనుగోలుతో శరవేగంగా వృద్ధి చెందుతున్న బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ మార్కెట్లో తమ స్థానం మరింత బలపడుతుందని ఇమామీ ఎండీ హర్షవర్థన్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా వచ్చే నాలుగున్నర ఏళ్లలో రెండు దశల్లో ఇంక్‌నట్‌లో మిగిలిన 40 శాతం వాటాను కూడా కొనుగోలు చేయనుంది.

ఇవి కూడా చదవండి..

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated Date - May 08 , 2026 | 01:43 AM