మళ్లీ ట్రిలియనీర్‌గా మస్క్
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:01 AM
టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్‌గా అవతరించారు. సోమవారానికి ఆయన సంపద నికర విలువ...
న్యూయార్క్: టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్‌గా అవతరించారు. సోమవారానికి ఆయన సంపద నికర విలువ 1.04 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.100.28 లక్షల కోట్లు) చేరింది. స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే 6,500 కోట్ల డాలర్లు (సుమారు రూ.6.26 లక్షల కోట్లు) పెరగడం ఇందుకు కలిసొచ్చింది. ఈ ఏడాది జూన్‌లో స్పేస్‌ఎక్స్ ఐపీఓ సూపర్ డూపర్ హిట్టవడంతో మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించారు. అయితే జూలైలో స్పేస్‌ఎక్స్ షేర్ల పతనంతో ఆ కిరీటమూ పోయింది. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు స్పేస్‌ఎక్స్ షేర్ల ధర 58 శాతం పెరగడంతో మస్క్ మళ్లీ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా ఎదిగారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన