Share News

ఎగుమతుల కేంద్రంగా భారత్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:06 AM

తన ఔషధ ఎగుమతులకు భారత్‌ను కేంద్రంగా చేసుకోవాలని అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ భావిస్తోంది. ‘బయో ఏషియా 2026’ సదస్సులో కంపెనీ భారత విభాగం ప్రెసిడెంట్‌, జనరల్‌ మేనేజర్‌ విన్‌సెలో...

ఎగుమతుల కేంద్రంగా భారత్‌

  • త్వరలో భారత్‌లో అల్జీమర్స్‌ ఔషధం: ఎలీ లిల్లీ

తన ఔషధ ఎగుమతులకు భారత్‌ను కేంద్రంగా చేసుకోవాలని అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ భావిస్తోంది. ‘బయో ఏషియా 2026’ సదస్సులో కంపెనీ భారత విభాగం ప్రెసిడెంట్‌, జనరల్‌ మేనేజర్‌ విన్‌సెలో టకర్‌ ఈ విషయం వెల్లడించారు. మొంజారోతో సహా కొన్ని కీలక ఔషధాలను భారత ఫార్మా కంపెనీల్లో కాంట్రాక్టు పద్దతిలో తయారు చేయించి, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నట్టు తెలిపారు. అయితే భారత్‌లోని ఏ కంపెనీల ప్లాంట్లలో వీటిని ఉత్పత్తి చేయనున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. భారత్‌లో 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.9,000 కోట్లు) పెట్టుబడి పెడతామన్న హామీలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అల్జీమర్స్‌ చికిత్సలో ఉపయోగించే డొనానెమాబ్‌ టాబ్లెట్లను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయబోతున్నట్టు టకర్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. నోవా నార్డి్‌స్కకి చెందిన వెయిట్‌లాస్‌ డ్రగ్‌ వెగోవీ నుంచి గట్టి పోటీ ఉన్నా తమ మొంజారో ఔషఽధ అమ్మకాలు బాగానే ఉన్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 18 , 2026 | 02:06 AM