Share News

హైదరాబాద్‌లో టార్జాన్‌ జంగిల్‌ కేఫ్‌: ఈబీజీ గ్రూప్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:48 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఈబీజీ గ్రూప్‌ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో వందకుపైగా...

హైదరాబాద్‌లో టార్జాన్‌ జంగిల్‌ కేఫ్‌: ఈబీజీ గ్రూప్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఈబీజీ గ్రూప్‌ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో వందకుపైగా ‘టార్జాన్‌ జంగిల్‌ కేఫ్‌’లు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది. వీటిని దేశంలోని ప్రధాన, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయనుంది. ఇందులో మొదటి కేఫ్‌ వచ్చే ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని తెలిపింది. ఆ తర్వాత వరుసగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, తదితర నగరాలకు విస్తరించనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే టార్జాన్‌ జంగిల్‌ కేఫ్‌ కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని ఈబీజీ తెలిపింది. తాము ఏర్పాటు చేసే 100కుపైగా టార్జాన్‌ జంగిల్‌ కేఫ్‌ స్టోర్లలో 20 స్టోర్లు సొంతంగా, మిగతా వాటిని ఫ్రాంచైజీ లేదా భాగస్వాముల ద్వారా ఏర్పాటు చేయబోతున్నట్టు ఈబీజీ గ్రూప్‌ చైర్మన్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

Updated Date - Oct 14 , 2026 | 05:48 AM