Share News

జేకే 250ఈ డ్రోన్లకు డీజీసీఏ సర్టిఫికేషన్‌: డ్రోగో ఏరోస్పేస్‌

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:36 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రక్షణ రంగ టెక్నాలజీ సంస్థ డ్రోగో ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరో ఘనత సాధించింది...

జేకే 250ఈ డ్రోన్లకు డీజీసీఏ సర్టిఫికేషన్‌: డ్రోగో ఏరోస్పేస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రక్షణ రంగ టెక్నాలజీ సంస్థ డ్రోగో ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరో ఘనత సాధించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో కంపెనీ అభివృద్ధి చేసిన జేకే 250ఈ ఫిక్స్‌డ్‌ వింగ్‌ డ్రోన్లకు.. పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) నుంచి కీలకమైన టైప్‌ సర్టిఫికెట్‌ లభించింది. దీంతో ఈ డ్రోన్లను శిక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఎలాంటి రన్‌వేల అవసరం లేకుండానే రెండు మూడు గంటల పాటు చక్కర్లు కొడుతూ నిట్ట నిలువుగా పైకి లేవడం, కిందికి దిగడం జేకే 250ఈ డ్రోన్ల ప్రత్యేకత.

ఈ వార్తలనూ చదవండి:

సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా

ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంకు

Updated Date - Oct 16 , 2026 | 05:36 AM