Share News

డాక్టర్‌ రెడ్డీస్‌ ‘సెమాగ్లుటైడ్‌’కు కెనడా గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:46 AM

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఉత్పత్తి చేసే జెనరిక్‌ ‘సెమాగ్లుటైడ్‌’ ఇంజక్షన్‌ త్వరలో కెనడా మార్కెట్లోనూ అందుబాటులోకి...

డాక్టర్‌ రెడ్డీస్‌ ‘సెమాగ్లుటైడ్‌’కు కెనడా గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఉత్పత్తి చేసే జెనరిక్‌ ‘సెమాగ్లుటైడ్‌’ ఇంజక్షన్‌ త్వరలో కెనడా మార్కెట్లోనూ అందుబాటులోకి రానుంది. ఇందుకు ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ ‘హెల్త్‌ కెనడా’ ఆమోదం తెలిపినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. ఒక ఔషధ కంపెనీ జెనరిక్‌ సెమాగ్లుటైడ్‌ ఇంజక్షన్‌కు హెల్త్‌ కెనడా ఆమోదం తెలపడం ఇదే మొదటిసారి. టైప్‌ 2 డయాబెటి్‌సను నియంత్రించే ఈ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ ఇటీవలే ఒబెడా పేరుతో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. తమ జెనరిక్‌ సెమాగ్లుటైడ్‌ ఔషధానికి హెల్‌ కెనడా ఆమోదం తెలపడం తమ ప్రయాణంలో పెద్ద మైలురాయి అని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. క్లిష్టమైన జనరిక్‌ ఔషధాల తయారీలో తమకు ఉన్న నైపుణ్యాలకు ఇది నిదర్శనమని కంపెనీ సీఈఓ ఎరెజ్‌ ఇజ్రాయెలీ తెలిపారు. దీంతో కెనడా ప్రజలకు అందుబాటు ధరల్లో సెమాగ్లుటైడ్‌ ఔషధం లభిస్తుందని పేర్కొన్నారు. 2 ఎంజీ పెన్‌, 4 ఎంజీ పెన్స్‌ రూపంలో కెనడా మార్కెట్లో ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..

Updated Date - Apr 30 , 2026 | 04:46 AM