రెండేళ్లలో 3,000 నియామకాలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:39 AM
అమెరికాకు చెందిన లోకల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డోర్‌డాష్.. హైదరాబాద్‌లో టాలెంట్ హబ్‌ను ప్రారంభించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాకు చెందిన లోకల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డోర్‌డాష్.. హైదరాబాద్‌లో టాలెంట్ హబ్‌ను ప్రారంభించింది. భారత్‌లో సంస్థకు ఇది తొలి కార్యాలయం. బుధవారం నాడు ఈ టాలెంట్ హబ్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు, డోర్‌డాష్ సీఎఫ్‌ఓ రవి ఇనుకొండ, సీనియర్ డైరెక్టర్ జెన్నా కోహెన్కే ప్రారంభించారు. ఈ సెంటర్‌కు సంబంధించి ఇప్పటికే 200 మంది నిపుణులను నియమించుకోగా డిసెంబరు నాటికి మరో 300 మంది నియమించు కోనున్నట్లు జెన్నా వెల్లడించారు. కాగా వచ్చే రెండేళ్లలో మొత్తం ఉద్యోగుల సంఖ్యను 3,000కు చేర్చనున్నట్లు ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డోర్‌డాష్‌లో ప్రస్తుతం 31,500 మంది ఉద్యోగులున్నారని జెన్నా తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..
దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు..