2025లో 17% పెరిగిన విమాన ప్రయాణికులు
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:44 AM
గత ఏడాది దేశీయ విమానయానానికి బాగానే కలిసొచ్చింది. 2025 మొత్తం మీద దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి 16.69 కోట్ల మంది విమాన ప్రయాణికులు రాకపోకలు సాగించారు...
మొత్తం 16.69 కోట్ల మంది రాకపోకలు
న్యూఢిల్లీ: గత ఏడాది దేశీయ విమానయానానికి బాగానే కలిసొచ్చింది. 2025 మొత్తం మీద దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి 16.69 కోట్ల మంది విమాన ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2024తో పోలిస్తే ఇది దాదాపు 3 శాతం ఎక్కువని డీజీసీఏ తెలిపింది. అయితే డిసెంబరులో దేశీయ విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య మాత్రం 1.43 కోట్లకు పడిపోయింది. డిసెంబరులో ఇండిగో అనేక విమాన సర్వీసులు రద్దు చేయడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దీంతో గత ఏడాది నవంబరులో దేశీయ విమానయాన మార్కెట్లో 63.6 శాతం ఉన్న ఇండిగో వాటా డిసెంబరులో 59.6 శాతానికి పడిపోయింది.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News