Share News

దొడ్ల డెయిరీ లాభంలో 35 శాతం క్షీణత

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:32 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దొడ్ల డెయిరీ నికర లాభం 35.4 శాతం క్షీణించి రూ.40.6 కోట్లుగా నమోదైంది....

దొడ్ల డెయిరీ లాభంలో 35 శాతం క్షీణత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దొడ్ల డెయిరీ నికర లాభం 35.4 శాతం క్షీణించి రూ.40.6 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.62.90 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో రెవెన్యూలు మాత్రం 19 శాతం వృద్ధితో రూ.1,006.90 కోట్ల నుంచి రూ.1,197.90 కోట్లకు పెరిగింది. కాగా మొత్తం రెవెన్యూలో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటా 34.6 శాతం (రూ.414.70 కోట్లు)గా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో వ్యయాలు అనూహ్యంగా పెరగటం పనితీరుపై ప్రభావం చూపించిందని తెలిపింది. డెయిరీ రంగంలోని డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ (డీ2సీ) సంస్థ సిద్స్‌ ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.11.60 కోట్ల పెట్టుబడితో 2 శాతం వాటా తీసుకునేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని దొడ్ల డెయిరీ వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి

Updated Date - Jul 26 , 2026 | 03:32 AM