హెచ్‌ఐవీ ఔషధం కోసం గిలీడ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
ABN , Publish Date - Sep 18 , 2026 | 02:23 AM
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తన హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో ఏడాదికి ఒకసారి ఉపయోగించినా హెచ్‌ఐవీ సోకకుండా అడ్డుకునే లెనాకెపావిర్ అనే ఔషధాన్ని తయారు చేయనుంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తన హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో ఏడాదికి ఒకసారి ఉపయోగించినా హెచ్‌ఐవీ సోకకుండా అడ్డుకునే లెనాకెపావిర్ అనే ఔషధాన్ని తయారు చేయనుంది. ఇందుకు అవసరమైన టెక్నాలజీ కోసం అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం గిలీడ్ సైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. గిలీడ్ అభివృద్ధి చేసిన ఈ ఔషధం ఇప్పటికే మనుషులపై ప్రయోగాల దశలో ఉంది. గిలీడ్‌కి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా నాన్ ఎక్స్‌క్లూజివ్ పద్దతిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ ఔషధాన్ని తయారు చేసి 120కిపైగా పేద, నిరుపేద దేశాల్లో మార్కెట్ చేయనుంది. కాగా ఏటా రెండుసార్లు తీసుకోవడం ద్వారా హెచ్‌ఐవీని అడ్డుకునే లెనాకెపావిర్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే తయారు చేసి మార్కెట్ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా? ఇలా చేయండి