పెప్టైడ్ సింథసిస్ సామర్థ్య విస్తరణకు దివీస్ రూ.2,000 కోట్ల పెట్టుబడి
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:50 AM
హైదరాబాద్‌కు చెంది న కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫార్మా దిగ్గజం దివీస్ లేబొరెటరీస్.. పెప్టైడ్ సింథసిస్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది...
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెంది న కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫార్మా దిగ్గజం దివీస్ లేబొరెటరీస్.. పెప్టైడ్ సింథసిస్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. పెప్టైడ్ ఆధారిత ఔషధాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సాలిడ్ ఫేజ్ పెప్టైడ్ సింథసిస్ (ఎస్‌పీపీఎస్) లైన్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి అనంతరం దివీస్ లేబొరెటరీస్ సీఈఓ డాక్టర్ కిరణ్ దివి విశ్లేషకులతో మాట్లాడుతూ.. కంపెనీ ప్రస్తుతం పలు 3,000-కిలో లీటరు ఎస్‌పీపీఎస్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కస్టమర్ల నుంచి వచ్చిన గిరాకీని దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిపాదిత లైన్లతోపాటు ఇతర సామర్థ్యాల విస్తరణకు సంబంధించిన పెట్టుబడుల గురించి కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్ (కమర్షియల్ ఆపరేషన్స్) నీలిమా ప్రసాద్ దివి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్‌ఎఫ్‌లను పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం అటు ఇటుగా సుమారు రూ.2,000 కోట్ల అవసరం ఉంటుందన్నారు. కాంట్రాక్టుల పరిమాణం గురించి కంపెనీ యాజమాన్యం వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!
కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?