Share News

దక్షిణ భారత మార్కెట్‌పై డిష్ టీవీ ఫోకస్.. రూ.149కే తెలుగు, తమిళ్ ప్యాక్స్..

ABN , Publish Date - May 19 , 2026 | 06:18 PM

దక్షిణ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని డిష్ టీవీ కొత్త ప్రాంతీయ భాషా ప్యాక్స్‌ను ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 'లాంగ్వేజ్ ఫస్ట్ ఫ్యాక్స్‌' రూపొందించింది.

దక్షిణ భారత మార్కెట్‌పై డిష్ టీవీ ఫోకస్.. రూ.149కే తెలుగు, తమిళ్ ప్యాక్స్..
Dish TV South India packs

దక్షిణ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని డిష్ టీవీ కొత్త ప్రాంతీయ భాషా ప్యాక్స్‌ను ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 'లాంగ్వేజ్ ఫస్ట్ ఫ్యాక్స్‌' రూపొందించింది. వీటి ధరలు నెలకు రూ.149 నుంచి ప్రారంభమవుతున్నాయి (Dish TV South India packs).

dish.jpg


సౌతిండియాలో కామెడీ షోలు, ప్రాంతీయ భాషా కంటెంట్, సినిమాలు, డైలీ సీరియల్స్‌కు మంచి ఆదరణ ఉందని, ఈ నేపథ్యంలో స్థానిక భాషా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త ప్యాక్స్ రూపొందించినట్లు డిష్ టీవీ యాజమాన్యం తెలిపింది (₹149 Dish TV pack).

dish3.jpg


కొత్త బేసిక్ ప్యాక్‌లో 225కి పైగా ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో 36కిపైగా తమిళ్ ఛానెల్స్ ఉండగా, తెలుగు, కన్నడ, మలయాళ ప్యాక్స్‌లో ప్రతి భాషకు 30కిపైగా ప్రాంతీయ ఛానెల్స్ ఉంటాయని సంస్థ వెల్లడించింది (South India DTH plans).

dish4.jpg


ఈ ప్యాక్స్‌లో ప్రాంతీయ ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాలు, డైలీ సీరియల్స్, స్పోర్ట్స్ ఛానెల్స్ కలిపి అందించనున్నారు (Dish TV regional packs). ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు, క్రికెట్, రీజనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కస్టమైజేషన్ అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

dish5.jpg


ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన


పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 19 , 2026 | 06:18 PM