Share News

హైదరాబాద్‌లో డీబీఎస్‌ వెల్త్‌ బ్రాంచ్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:28 AM

డీబీఎస్‌ బ్యాంకు ఇండియా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తోంది...

హైదరాబాద్‌లో డీబీఎస్‌ వెల్త్‌ బ్రాంచ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డీబీఎస్‌ బ్యాంకు ఇండియా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తోంది. తాజాగా నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతంలో ట్రెజర్స్‌ వెల్త్‌ బ్రాంచ్‌ ఏర్పాటు చేసింది. ఈ బ్రాంచ్‌ ద్వారా సంపన్న వర్గాలకు పెట్టుబడుల నిర్వహణలో అవసరమైన సేవలు అందించనుంది. ఈ బ్రాంచ్‌లో ఉండే ట్రెజర్స్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, వెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌, స్పెషలైజ్డ్‌ ఎన్‌ఆర్‌ఐ నిపుణులు ఖాతాదారులకు అవసరమైన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందిస్తారు. బ్యాంకింగ్‌ సేవలతో పాటు పెట్టుబడులు, పెట్టుబడుల నిర్వహణకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట ఈ బ్రాంచ్‌ ద్వారా అందుకోవచ్చని డీబీఎస్‌ బ్యాంకు ఇండియా తెలిపింది.

ఇవీ చదవండి

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

కనపడని డాక్టర్‌..ఏఐ

Updated Date - Nov 17 , 2026 | 05:28 AM