Share News

హైదరాబాద్‌లో దైకిన్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:20 AM

ఎలక్ర్టానిక్‌ ఉపకరణాల రంగంలోని దైకిన్‌కు దక్షిణ భారతంలోనే అతి పెద్ద డీలర్‌గా ఉన్న శ్రీ కంఫర్ట్స్‌ హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో దైకిన్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎలక్ర్టానిక్‌ ఉపకరణాల రంగంలోని దైకిన్‌కు దక్షిణ భారతంలోనే అతి పెద్ద డీలర్‌గా ఉన్న శ్రీ కంఫర్ట్స్‌ హైదరాబాద్‌లో అత్యాధునిక ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. డీలర్‌షిప్‌ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని దైకిన్‌ డైరెక్టర్‌ సంజయ్‌ గోయల్‌ ఈ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. 2001 సంవత్సరంలో ప్రారంభమైన శ్రీ కంఫర్ట్స్‌ దక్షిణ భారతదేశంలో హెచ్‌వీఏసీ ప్రాజెక్టుల నిర్మాణంలో బలమైన పునాది ఏర్పాటు చేసుకుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

శ్రీ సిటీ కొత్త ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

ఏపీలోని శ్రీ సిటీలో కొత్త ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు గోయల్‌ చెప్పారు. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీసిటీ ప్లాంట్‌ ను 200 ఎకరాలకు విస్తరించినట్టు తెలిపా రు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ సమీపంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో మరో అంతర్జాతీయ స్థాయి ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంస్థకు ఇప్పటికే హైదరాబాద్‌, నీమ్రాణాలో రెండు ఆర్‌ అండ్‌ డీ సెంటర్లున్నాయి.

ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 24 , 2026 | 05:20 AM