Share News

సైయెంట్‌ రూ.720 కోట్ల షేర్ల బైబ్యాక్‌

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:18 AM

స్థానిక ఐటీ కంపెనీ సైయెంట్‌ షేర్ల బై బ్యాక్‌ ప్రకటించింది. ఒక్కో షేరును రూ.1,125 చొప్పున తిరిగి కొనుగోలు చేసేందుకు గురువారం సమావేశమైన...

సైయెంట్‌ రూ.720 కోట్ల షేర్ల బైబ్యాక్‌

ఒక్కో షేరుకు రూ.1,125

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్థానిక ఐటీ కంపెనీ సైయెంట్‌ షేర్ల బై బ్యాక్‌ ప్రకటించింది. ఒక్కో షేరును రూ.1,125 చొప్పున తిరిగి కొనుగోలు చేసేందుకు గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ ఈ బైబ్యాక్‌పై రూ.720 కోట్లు మించకుండా ఖర్చు చేయనుంది.

నికర లాభం రూ.588 కోట్లు: 2025-26 ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలకు కూడా కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కాలానికి కంపెనీ డిజిటల్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ (డీఈటీ) విభాగం రూ.5,819 కోట్ల ఆదాయంపై రూ.588 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 5.5ు, నికర లాభం 7.2ు పెరిగాయి. ఈ ఏడాది 31 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి కంపెనీ డీఈటీ విభాగం రూ.1,500 కోట్ల ఆదాయంపై రూ.138 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం క్యూ4తో పోల్చినా కంపెనీ ఆదాయం 7.4%, నికర లాభం 9.1% పెరిగాయి.

ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 24 , 2026 | 05:18 AM