సైయెంట్ సెమీకండక్టర్స్‌కు రూ.94 కోట్ల నిధులు
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:28 AM
హైదరాబాద్‌కు చెందిన సైయెంట్ సెమీకండక్టర్స్.. ఎసెన్షియల్ సెమీకండక్టర్స్ తయారీ సంస్థ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన సైయెంట్ సెమీకండక్టర్స్.. ఎసెన్షియల్ సెమీకండక్టర్స్ తయారీ సంస్థ గ్లోబల్‌ఫౌండ్రీస్ నుంచి రూ.94 కోట్ల నిధులను సమీకరించింది. వ్యూహాత్మక ఈక్విటీ పెట్టుబడు ల్లో భాగంగా సైయెంట్ ఈ మొత్తాలను సమీకరించింది. కస్టమ్ అప్లికేషన్-స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సామర్థ్యాలతో పాటు సిలికాన్ అభివృద్ధికి ఈ మొత్తాలను వినియోగించనున్నట్లు సైయెంట్ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..