Share News

సైయెంట్‌ సెమీకండక్టర్స్‌కు రూ.286 కోట్లు

ABN , Publish Date - May 26 , 2026 | 05:31 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సైయెంట్‌ సెమీకండక్టర్స్‌.. ఎడల్‌వీజ్‌ నుంచి రూ.286 కోట్ల (3 కోట్ల డాలర్లు) నిధులను...

సైయెంట్‌ సెమీకండక్టర్స్‌కు రూ.286 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సైయెంట్‌ సెమీకండక్టర్స్‌.. ఎడల్‌వీజ్‌ నుంచి రూ.286 కోట్ల (3 కోట్ల డాలర్లు) నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఎడల్‌వీజ్‌కు చెందిన ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్‌ లిమిటెడ్‌ పాటు అనుబంధ కో-ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాలను సమీకరించినట్లు తెలిపింది. ఈ లావాదేవీలో భాగంగా రూ.100 కోట్ల పెట్టుబడి.. ఈక్విటీ ఇన్వె్‌స్టమెంట్‌గా ఉంటుందని పేర్కొంది. నిధుల సమీకరణలో భాగంగా కంపెనీ విలువను రూ.4,600 కోట్లు (50 కోట్ల డాలర్లు)గా లెక్కించినట్లు సైయెంట్‌ సెమీకండక్టర్స్‌ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్

Updated Date - May 26 , 2026 | 05:31 AM