సైయెంట్ సెమీకండక్టర్స్ చేతికి కైనెటిక్ టెక్నాలజీస్
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:57 AM
అమెరికాకు చెందిన పవర్ సెమీకండక్టర్ సొల్యూషన్స్ సంస్థ కైనెటిక్ టెక్నాలజీ్‌సలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాకు చెందిన పవర్ సెమీకండక్టర్ సొల్యూషన్స్ సంస్థ కైనెటిక్ టెక్నాలజీ్‌సలో 74 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు సైయెంట్ సెమీకండక్టర్స్ ప్రకటించింది. సైయెంట్ సెమీకండక్టర్స్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్ 8.5 కోట్ల డాలర్లకు ఈ వాటాను చేజిక్కించుకున్నట్లు తెలిపింది. కైనటిక్ టెక్ కొనుగోలుతో అంతర్జాతీయ కస్టమర్లకు డిజైన్ రీసోర్సెస్ విస్తరించటంతో పాటు నిర్వహణాపరంగా సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..