సైకిల్ ప్యూర్ కొత్త ఉత్పత్తులు
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:45 AM
వార్షికంగా 1,200 కోట్ల అగర్బత్తీలను తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్నట్టు సైకిల్ప్యూర్ అగర్బత్తీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ రంగ తెలిపారు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వార్షికంగా 1,200 కోట్ల అగర్బత్తీలను తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్నట్టు సైకిల్ప్యూర్ అగర్బత్తీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ రంగ తెలిపారు. మంగళవారం నాడిక్కడ కంపెనీ ఉత్పత్తులు రాయల్ సీక్రెట్, బన్సూరి దర్బార్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ కంపెనీ దాదాపు 800 ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను కలిగి ఉందని చెప్పారు. పూజ ఉత్పత్తుల కంపెనీ సాత్విక్ను ఇటీవల కొనుగోలు చేశామని, దీని ద్వారా తమ పూజ ఉత్పత్తుల సంఖ్య మరింతగా విస్తరిస్తుందని చెప్పారు. అగర్బత్తీల మార్కెట్ పరిమాణం రూ.7,000 కోట్లు ఉండవచ్చని తెలిపారు. ఏపీ, తెలంగాణలో కంపెనీకి మూడు ప్లాంట్లున్నాయని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక
వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్పై చైనాకు భారత్ కౌంటర్