Share News

సియెనాతో కంట్రోల్‌ఎస్‌ జట్టు

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:00 AM

అమెరికాకు చెందిన నెట్‌వర్కింగ్‌ సంస్థ సియెనాతో కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌ జట్టు కట్టింది. ఇందులో భాగంగా...

సియెనాతో కంట్రోల్‌ఎస్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాకు చెందిన నెట్‌వర్కింగ్‌ సంస్థ సియెనాతో కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌ జట్టు కట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, నోయిడాల్లోని మొత్తం తొమ్మిది డేటా సెంటర్లను అనుసంధానం చేస్తూ ఐదు మెట్రో నెట్‌వర్క్స్‌ను అభివృద్ధి చేయనుంది. కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ సేవల నుంచి బ్యాండ్‌విడ్త్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో ఈ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంట్రోల్‌ఎస్‌ వెల్లడించింది. ఈ నెట్‌వర్క్‌ ద్వారా సెకనుకు 100 టెరాబైట్‌ సామర్థ్యాన్ని ఆఫర్‌ చేయనున్నట్లు పేర్కొంది. కంపెనీ భారీ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ ఉండనుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 05:00 AM