Share News

క్రూడ్‌ 10 డాలర్లు పెరిగితే.. ద్రవ్యోల్బణం 0.6 శాతం అప్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:42 AM

అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు దేశంలో ద్రవ్యోల్బణం 0.55-0.6% మేరకు పెరుగుతూ....

క్రూడ్‌ 10 డాలర్లు పెరిగితే.. ద్రవ్యోల్బణం 0.6 శాతం అప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు దేశంలో ద్రవ్యోల్బణం 0.55-0.6% మేరకు పెరుగుతూ పోతుందని ఆర్థికవేత్తల అంచనా. వినియోగదారుల ధరల సూచీలో ఇంధన ఉత్పత్తులకు అధిక వెయిటేజీ ఉండడమే ఇందుకు కారణమని కేర్‌ ఎడ్జ్‌ గ్లోబల్‌ ఐఎ ఫ్‌ఎ్‌ససీ లిమిటెడ్‌ సీఈఓ రేవతి కస్తూరి అన్నారు. క్రూడాయిల్‌ ధరల ప్రభావాన్ని కొంత మేరకు మన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సద్దుబాటు చేసుకోగలవని, కాని నిలకడగా పెరుగుతూ పోతే మాత్రం ఆ భారాన్ని వినియోగదారులకే బదిలీ చేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. క్రూడాయిల్‌కు మనం పశ్చిమాసియాపై అధికంగా ఆధారపడడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.5-6.8% మధ్యన ఉంటుందని ఆమె అంచనా వేశారు.

ఈవై అంచనా కూడా అదే: పశ్చిమాసియా సంక్షోభం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగితే జీడీపీ వృద్ధి రేటు 1ు మేరకు ప్రభావితం అవుతుందని, రిటైల్‌ ద్రవ్యోల్బణం 1.5ు మేరకు పెరుగుతుందని ఈవై అంచనా. టెక్స్‌టైల్స్‌, పెయింట్లు, రసాయనాలు, ఎరువులు, సిమెంట్‌ సహా కార్మిక ప్రాధాన్య రంగాలు సైతం ప్రత్యక్షంగా ప్రభావితం కావచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలైన ఈ రంగాల్లో డిమాండు తగ్గవచ్చని హెచ్చరించింది.

ఇవీ చదవండి:

ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్

మార్చి 31 డెడ్‌లైన్.. ఈ 3 పనులు వెంటనే పూర్తి చేయండి!

Updated Date - Apr 01 , 2026 | 02:44 AM