70 డాలర్లకు చమురు ధర!
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:26 AM
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కోసం అంతర్జాతీయ మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఒప్పందం కుదిరితే...
ఫిచ్ రేటింగ్స్
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కోసం అంతర్జాతీయ మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఒప్పందం కుదిరితే ఈ ఏడాది సెప్టెంబరు నాటికి బ్యారల్ ముడి చమురు ధర 70 డాలర్లకు దిగి వస్తుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అమెరికా-ఇరాన్ అతిత్వరలో శాంతి గీతం పాడబోతున్నాయనే వార్తలతో ఆదివారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ రకం ముడి చమురు ధర 4 శాతం తగ్గి 87 డాలర్ల వద్ద ట్రేడైంది. నిజంగానే ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే ఇది మరింత తగ్గి బ్యారల్ చమురు ధర 70 డాలర్లకు దిగి వస్తుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది.
ఇవీ చదవండి:
AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా
అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్