ఆయిల్ కంపెనీల లాభాలపై ఒత్తిడి
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:53 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రభుత్వ ఆయిల్ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడిని పెంచుతోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు దీటుగా పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ ధరలు...
రేటింగ్ సంస్థలు
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రభుత్వ ఆయిల్ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడిని పెంచుతోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు దీటుగా పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీల లాభాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే వాటి పరపతి రేటింగ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్, ఫిచ్ రేటింగ్స్ తమ తాజా నివేదికల్లో హెచ్చరించాయి. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభంలోనూ ఓఎంసీలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అప్పుడు కూడా బ్యారెల్ ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్ల వరకు పెరిగింది. అయినా ప్రభుత్వ పరోక్ష ఒత్తిడితో పెట్రోల్, డిజిల్ ధరలు పెంచకుండానే కంపెనీలు నెట్టుకొచ్చాయి. ఒకవేళ ధరలు మరింతగా కొండెక్కినా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల తగ్గింపు, సబ్సిడీల రూపంలో ఆదుకునే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ అంచనా.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..