క్రాప్ ప్రొటెక్షన్ కంపెనీగా కోర్టెవా
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:09 AM
అమెరికాకు చెందిన అగ్రి-సైన్సెస్ సంస్థ కోర్టెవా ఇంక్.. తన సీడ్ వ్యాపారాన్ని పూర్తిగా విభజించినట్లు ప్రకటించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాకు చెందిన అగ్రి-సైన్సెస్ సంస్థ కోర్టెవా ఇంక్.. తన సీడ్ వ్యాపారాన్ని పూర్తిగా విభజించినట్లు ప్రకటించింది. ఇకపై పూర్తిగా క్రాప్ ప్రొటెక్షన్ కంపెనీగా కార్యకలాపాలు సాగించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే దశాబ్ద కాలంలో 12 కొత్త యాక్టివ్ ఇన్‌గ్రిడియెంట్స్, ఐదు బయోలాజికల్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ క్రాప్ ప్రొటెక్షన్ ఉత్పత్తుల విలువ దాదాపు 110 కోట్ల డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. కాగా 2020-25 మధ్య కాలంలో కంపెనీ క్రాప్ ప్రొటెక్షన్ వ్యాపారం 100 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. కోర్టెవా.. తెలంగాణలోని తూప్రాన్‌లో ఆర్ అండ్ డీ సెంటర్‌తో పాటు వర్గల్‌లో ప్లాంట్లను నిర్వహిస్తోంది. కంపెనీ ప్రస్తుతం 110కి పైగా దేశాల్లో 9,000 మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..