భారీగా తగ్గిన కోరమాండల్ లాభం
ABN , Publish Date - May 08 , 2026 | 01:20 AM
డచిన ఆర్థిక సంవత్సరం (2025-26).. మార్చితో ముగిసిన త్రైమాసిక చివరి త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26).. మార్చితో ముగిసిన త్రైమాసిక చివరి త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం 80ు క్షీణించి రూ.115 కోట్లుగా నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.578 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం మాత్రం 19 శాతం వృద్ధితో రూ.5,114 కోట్ల నుంచి రూ.6,068 కోట్లకు పెరిగింది. స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన కూడా కంపెనీ నికర లాభం 60 శాతం క్షీణించి రూ.154 కోట్లుగా నమోదైంది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.
ఇవి కూడా చదవండి..
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..