12 రాష్ట్రాల్లో ‘గ్రోమోర్ గ్రామ్ మోడల్’
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:19 AM
ప్రముఖ ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు...
కోరమాండల్ ఇంటర్నేషనల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 12 రాష్ట్రాల్లోని 101 గ్రామాల్లో ‘గోమోర్ గ్రామ్ మోడల్’ పేరుతో కొత్త వ్యవసాయ విస్తరణ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా సమతుల పోషక ఎరువులు వినియోగించేలా రైతులను ప్రోత్సహించి, స్థిరమైన దిగుబడులకు కృషి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ ఆయా గ్రామాల్లోని రైతులకు భూసారం, ఆకుల పరీక్షలు, పంటల సాగుపై సలహాలు, సూచనలు, డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు వంటి సేవలు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓ)కు అవసరమైన అగ్రి ఇన్‌పుట్స్‌ను అందించేందుకు గాను సమున్నతి అగ్రి వాల్యూ చెయిన్‌తో కోరమాండల్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇవి కూడా చదవండి..
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన..