Share News

రికార్డు స్థాయిలో రాగి ధర

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:18 AM

రాగి (కాపర్‌) ధర చుక్కలంటుతోంది. లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీ (ఎల్‌ఎంఈ)లో టన్ను రాగి ధర ఈ నెల ఒక దశలో రికార్డు స్థాయిలో 14,737 డాలర్లకు...

రికార్డు స్థాయిలో రాగి ధర

న్యూఢిల్లీ: రాగి (కాపర్‌) ధర చుక్కలంటుతోంది. లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీ (ఎల్‌ఎంఈ)లో టన్ను రాగి ధర ఈ నెల ఒక దశలో రికార్డు స్థాయిలో 14,737 డాలర్లకు (సుమారు రూ.14.07 లక్షలు) చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ. గనుల నుంచి తవ్వి తీసే రాగి ఖనిజ ఉత్పత్తి తగ్గడం, అమెరికా సుంకాల భయంతో పాటు పెద్దఎత్తున దిగుమతులకు దిగడం ఇందుకు ప్రధాన కారణమని ఇండియన్‌ ప్రైమరీ కాపర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఐపీసీపీఏ) తెలిపింది. గనుల నుంచి ముడి ఖనిజ ఉత్పత్తి తగ్గి సరఫరాలు తగ్గటంతో పాటు చైనాలో రిఫైనింగ్‌ సామర్ధ్యం పెరగడం పరిశ్రమను మరింత భయపెడుతోందని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 05:18 AM