వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు..
ABN , Publish Date - Jun 01 , 2026 | 07:19 AM
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం (జూన్ 1) నుంచి వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి (Commercial LPG Price Hike). సోమవారం (జూన్ 1) నుంచి వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ఢిల్లీలో రూ.42 పెంచుతున్నట్టు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ. 3,113.5కు చేరింది (LPG Cylinder Price Today).
ఈ పెంపు కారణంగా హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3294కు చేరుకుంది. అలాగే చెన్నైలో రూ.3232కు చేరింది. కాగా, కోల్‌కతాలో అధికంగా ఒక్కో వాణిజ్య సిలిండర్‌పై రూ.53.50 మేర పెరిగింది. దీంతో కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.3255కు చేరింది. ఇక, ఐదు కేజీల ఫ్రీట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లపై రూ.11 చొప్పున పెంచారు. కాగా, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులూ లేవు.
ఇవి కూడా చదవండి..
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..