సిటిజన్ ఫైనాన్షియల్ జీసీసీలో మరిన్ని నియామకాలు
ABN , Publish Date - May 19 , 2026 | 01:53 AM
అమెరికాకు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ కలిసి హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ...
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాకు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ కలిసి హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. ఏడాదిలో ఈ జీసీసీలో 1,000 నియామకాలు జరిపినట్లు, భవిష్యత్ వృద్ధి కోసం ఏఐ, క్లౌడ్, డేటా, డిజిటల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మరిన్ని నియామకాలు చేపట్టనున్నట్లు సిటిజన్ ఫైనాన్షియల్ తెలిపింది.
వియోనా ఫిన్‌టెక్‌కు ఎన్‌పీసీఐ సర్టిఫికేషన్
హైదరాబాద్‌కు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ వియోనా ఫిన్‌టెక్ తన టెక్నాలజీకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) నుంచి సర్టిఫికేషన్ దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి..
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..
ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..