డిజిన్వె్‌స్టమెంట్‌లక్ష్యం రూ.80,000 కోట్లు
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:33 AM
2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎ్‌సయూ) ల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్‌స్టమెంట్)తో పాటు...
2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎ్‌సయూ) ల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్‌స్టమెంట్)తో పాటు పీఎ్‌సయూల కీలకేతర ఆస్తుల నగదీకరణ ద్వారా రూ.80,000 కోట్లు సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) సవరించిన డిజిన్వె్‌సమెంట్ టార్గెట్ రూ.34,000 కోట్లతో పోలిస్తే చాలా అధికమిది. గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వం డిజిన్వె్‌స్టమెంట్ లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. అయితే, పీఎ్‌సయూల నిర్వచనాన్ని మార్చాలని.. వీటిలో ప్రభుత్వ కనీస వాటా పరిమితిని 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించాలని బడ్జెట్‌కు ముందు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నివేదిక సూచించింది.
ఇవీ చదవండి:
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..