Share News

బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణకు కేంద్రం ఓకే

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:46 AM

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) ఉద్యోగులు, అధికారుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని బ్యాంకులను కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. 13వ ద్వైపాక్షిక...

బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణకు కేంద్రం ఓకే

12 నెలల్లోపు చర్చలు ముగించాలని ఆదేశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) ఉద్యోగులు, అధికారుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని బ్యాంకులను కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. 13వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం కోసం చర్చలను తక్షణమే ప్రారంభించి వచ్చే 12 నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. వేతన సవరణ 2027 నవంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. ఈసారి ఎలాంటి జాప్యం లేకుండా గడువు తేదీ నుంచే కొత్త వేతనాలు వర్తించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. చర్చలతో పాటు సంబంధిత నియంత్రణ మార్పులను కూడా షెడ్యూల్‌ తేదీ కంటే ముందే పూర్తి చేయాలని ఆదేశించింది. పీఎ్‌సబీలు, బీమా సంస్థలతో సహ ఇతర ఆర్థిక సంస్థలు తమ ఉద్యోగుల వేతన సవరణను ప్రతి ఐదేళ్లకోసారి చేపడతాయి. కాగా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పరస్పర అంగీకారంతో కూడిన వేతన ప్యాకేజీని రూపొందించనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 01:46 AM