సీసీఎల్ ప్రొడక్ట్స్ లాభం రూ.114 కోట్లు
ABN , Publish Date - May 08 , 2026 | 01:17 AM
సీసీఎల్ ప్రొడక్ట్స్ గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సీసీఎల్ ప్రొడక్ట్స్ గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,226.38 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.114.52 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.839.65 కోట్ల ఆదాయంపై రూ.101.86 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో కంపెనీ రూ.2 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.3 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.4,465.80 కోట్ల ఆదాయంపై రూ.388.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఇవి కూడా చదవండి..
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..