Share News

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ లాభం రూ.36 కోట్లు

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:50 AM

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి...

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ లాభం రూ.36 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.564.29 కోట్ల రెవెన్యూపై రూ.36.24 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.9.37 కోట్లుగా ఉండగా ఆదాయం రూ.401.59 కోట్లుగా ఉంది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2.75 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 05 , 2026 | 05:50 AM