హైదరాబాద్‌లో కాసాగ్రాండ్ ‘వైబ్’
ABN , Publish Date - May 01 , 2026 | 04:44 AM
రియల్టీ సంస్థ కాసాగ్రాండ్ హైదరాబాద్‌లో సరికొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. రాజేంద్రనగర్‌లో 35 ఎకరాల విస్తీర్ణంలో...
హైదరాబాద్: రియల్టీ సంస్థ కాసాగ్రాండ్ హైదరాబాద్‌లో సరికొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. రాజేంద్రనగర్‌లో 35 ఎకరాల విస్తీర్ణంలో కాసాగ్రాండ్ వైబ్ పేరుతో హైదరాబాద్‌లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 362 5 బీహెచ్‌కే విల్లాలను నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఒక్కో ఎకరంలో సుమారు 10 విల్లాలను మాత్రమే నిర్మిస్తున్నట్లు పేర్కొంది. 25 ఎకరాలను పూర్తిగా పచ్చదనానికే కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో ఒక్కో విల్లా ధర రూ.3.2 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కాసాగ్రాండ్ తెలిపింది. 93 కాస్మోపాలిటన్ సదుపాయాలు, 40,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్, 3,600 చదరపు అడుగుల రూఫ్‌టాప్ స్విమ్మింగ్ పూల్, కాసాగ్రాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలని పేర్కొంది. కాగా ఈ ఏడాదిలో హైదరాబాద్‌లో కంపెనీ ప్రారంభించిన ఐదో ప్రాజెక్ట్ ఇదని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు