Share News

తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరణ

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:19 AM

దేశంలోని ప్రముఖ ఆటో టెక్‌ కంపెనీల్లో ఒకటైన ‘కార్స్‌24’ తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా యూజ్డ్‌ కార్ల అమ్మకాల...

తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలోని ప్రముఖ ఆటో టెక్‌ కంపెనీల్లో ఒకటైన ‘కార్స్‌24’ తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా యూజ్డ్‌ కార్ల అమ్మకాల కోసం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒక హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ సీఎ్‌ఫఓ శివాన్షు మక్కర్‌ చెప్పారు. మరో ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా వైజాగ్‌లో, తెలంగాణలోని వరంగల్‌లో తమ అమ్మకం కేంద్రాలను ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూడు కేంద్రాల ద్వారా నెలకు 1,200 నుంచి 1,500 యూజ్డ్‌ కార్లను విక్రయిస్తున్నట్టు తెలిపారు. కార్స్‌24 ప్లాట్‌ఫామ్‌ వచ్చే 12 నెలల్లో ఐపీఓకు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి..

దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్‌ డీల్‌పై రాహుల్ గాంధీ

మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్‌‌ ప్రశ్నల వర్షం

Updated Date - Feb 12 , 2026 | 05:19 AM