Share News

కారు.. గిరాకీ ఫుల్లు!

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:10 AM

గత నెలలోనూ కార్లకు బలమైన గిరాకీ నమోదైంది. మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం), హ్యుండయ్‌ మోటార్‌ టోకు విక్రయాలు...

కారు.. గిరాకీ ఫుల్లు!

న్యూఢిల్లీ: గత నెలలోనూ కార్లకు బలమైన గిరాకీ నమోదైంది. మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం), హ్యుండయ్‌ మోటార్‌ టోకు విక్రయాలు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది దసరా, దీపావళి పండగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రయా ణికుల వాహనాలపై జీఎ్‌సటీని గణనీయంగా తగ్గించడంతో పాటు మార్కెట్లో కి కొత్త మోడళ్ల విడుదల ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ దేశీయ టోకు అమ్మకాలు గతనెలలో 1,74,529 యూనిట్లకు పెరిగాయి. జనవరిలో కంపెనీ మొత్తం విక్రయాలు (దేశీయం గా అమ్మకాలు+ఎగుమతులు) సరికొత్త రికార్డు స్థాయి 2,36,963 యూనిట్లకు చేరాయని మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) పార్థో బెనర్జీ తెలిపారు. మార్కెట్లో మారుతి కార్లకు రోజుకు 9,000- 10,000 వరకు బుకింగ్స్‌ లభిస్తున్నాయన్నారు.

  • టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహన దేశీయ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 46ు వృద్ధితో 70,222 యూనిట్లకు ఎగబాకాయి.

  • ఎం అండ్‌ ఎం తన డీలర్లకు 63,510 యూనిట్ల వాహనాలను సరఫరా చేసింది. 2025 జనవరితో పోలిస్తే 25ు అధికం.

  • హ్యుండయ్‌ మోటార్‌ హోల్‌సేల్స్‌ 9ు పెరిగి 59,107 యూనిట్లుగా నమోదయ్యాయి.

  • టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ దేశీయ అమ్మకాలు 17%

వృద్ధితో 30,630 యూనిట్లకు పెరిగాయి.

  • కియా ఇండియా సేల్స్‌ 10ు పెరిగి 27,603 యూనిట్లకు చేరగా.. రెనో ఇండియా అమ్మకాలు 34ు ఎగబాకి 3,715 యూనిట్లకు చేరాయి.

ధరలు పెంచే

యోచనలో మారుతి

మారుతి సుజుకీ కార్లు మరింత ప్రియం కానున్నాయి. కార్ల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కొంత భారాన్ని కస్టమర్ల పైకి బదిలీ చేయాలని భావిస్తున్నట్లు పార్థో బెనర్జీ తెలిపారు. ఉత్పత్తి అవరోధాల కారణంగా ప్రస్తుతం 1.75 లక్షల యూనిట్లకు పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ఇవీ చదవండి:

అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..

Updated Date - Feb 03 , 2026 | 05:10 AM