‘కంట్రోల్‌ఎస్’లోకి రూ.7,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న కెనడా సంస్థ
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:20 AM
స్థానిక కంట్రోల్‌ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ భారత్‌లోని తన డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలను భారీ ఎత్తున విస్తరిస్తోంది. ఇందుకోసం రూ.7,000 కోట్ల మొత్తాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థానిక కంట్రోల్‌ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ భారత్‌లోని తన డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలను భారీ ఎత్తున విస్తరిస్తోంది. ఇందుకోసం రూ.7,000 కోట్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేందుకు కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వె్‌స్టమెంట్ బోర్డు (సీపీపీఐబీ) ముందుకొచ్చింది. ఇందులో రూ.4,000 కోట్లతో కంట్రోల్ డేటా సెంటర్స్ ఈక్విటీలో 8.2శాతం వాటా కొనుగోలు చేస్తుంది. మిగతా రూ.3,000 కోట్లను రెండు సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసే ఒక జాయింట్ వెంచర్ (జేవీ) కంపెనీలో పెట్టుబడి పెట్టనుంది. ఈ జేవీ ద్వారా దేశవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా కేం ద్రాల క్యాంప్‌సలు ఏర్పాటు చేస్తారు. ఈ కంపెనీ ఈక్విటీలో సీపీపీఐబీకి 48శాతం, కంట్రోల్‌ఎస్ డేటా సెంటర్స్‌కు 52ు వాటా ఉంటుంది.
ఏఐ రెడీ మౌలిక సదుపాయాలు : దేశంలో ఏఐ ఆధారిత డేటా సెంటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలకు డిమాండ్ క్రమం గా పెరుగుతోంది. ముఖ్యంగా హైపర్ స్కేలర్లు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎంటర్‌ప్రైజెస్ డేటా కేంద్రాల నుంచి ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ తీర్చేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని కంట్రోల్‌ఎస్ డేటా సెంటర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ పిన్నపురెడ్డి శ్రీధర్ తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా కంపెనీ కార్యకలాపాను విస్తరించడమేగాక ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్‌లో ఏఐ ఆధారిత డేటా సెంటర్ల మౌలిక సదుపాయాల విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించబోతున్నట్టు చెప్పారు.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్