Share News

బులియన్‌ ‘బేర్‌’

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:19 AM

బులియన్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల కంట రక్తకన్నీరు కార్పిస్తోంది. ఇంకా, ఇంకా పెరుగుతుందని అత్యాశకు పోయి గత నెల రోజులుగా ఎగబడి బంగారం, వెండి కొనిపెట్టుకున్న...

బులియన్‌ ‘బేర్‌’

మూడు రోజుల్లో వెండి రూ.1.44 లక్షలు డౌన్‌

17% నష్టపోయిన పసిడి ధర

న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల కంట రక్తకన్నీరు కార్పిస్తోంది. ఇంకా, ఇంకా పెరుగుతుందని అత్యాశకు పోయి గత నెల రోజులుగా ఎగబడి బంగారం, వెండి కొనిపెట్టుకున్న మదుపరు లు, కొనుగోలుదారులు ఇపుడు ఎరక్కపోయి ఇరుక్కుపోయామని లబోదిబోమంటున్నారు. సోమవారంనాడు కూడా బులియన్‌ మార్కెట్‌లో మహా పతనం కొనసాగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.52,000 నష్టంతో రూ.2.6 లక్షల వద్ద ముగిసిం ది. పది గ్రాముల మేలిమి బంగారం రూ.12,800 పతనమై రూ.1,52,700 వద్ద ముగిసింది. దీంతో గత మూడు రోజుల్లోనే ఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,44,500 (36ు), 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.30,300 (17ు) నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్‌: అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం, వెండి ధరలు కుదేలయ్యాయి. ఔన్స్‌ (31.10 గ్రా ములు) మేలిమి బంగారం రెండు శాతం నష్టంతో 4,715 డాలర్ల వద్ద, వెండి 1.4 శాతం నష్టంతో 79 డాలర్ల ఇంట్రా డే కనిష్ఠ స్థాయిని తాకాయి.

ఫ్యూచర్స్‌ మార్కెట్‌: ఈ మార్కెట్లో పసిడి ధర మాత్రమే కొద్దిగా కోలుకుంది. ఏప్రిల్‌లో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం ఎంసీఎక్స్‌లో సోమవారం ప్రారంభంలో ఒక దశలో రూ.10,688 నష్టంతో (7.2ు) రూ.1,37,065 ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది, చివరికి కొద్ది గా కోలుకుని రూ.259 స్వల్ప లాభంతో రూ.1,48,012 వద్ద ముగిసింది. వెండి వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిసింది. కిలోకు రూ.39,847 (15ు) నష్టంతో రూ.2,25,805 ఇంట్రా డే కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి రూ.15,410 (5.8%) నష్టంతో రూ.2,50,242 వద్ద ముగిసింది.

పతనానికి కారణాలు

  • మదుపరుల లాభాల స్వీకరణ అమ్మకాలు.

  • ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్‌ మారకం రేటు పుంజుకోవడం.

  • అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం.

  • అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభిస్తాయనే భయాలు సద్దుమణగడం

  • కేంద్ర బడ్జెట్‌లో పసిడి, వెండి దిగుమతులపై సుంకాల పెంపు లేకపోవడం.

  • అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు తగ్గడం.

ఇవీ చదవండి:

అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..

Updated Date - Feb 03 , 2026 | 05:19 AM