Share News

డాలర్‌ విలువ రూ. 94.03

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:51 AM

డాలర్‌ మారకంలో రూపాయి సోమవారం సరికొత్త కనిష్ఠానికి జారుకుంది. రూపాయి విలువ ఒకదశలో 50 పైసలు క్షీణించి రూ.94.03 వద్దకు చేరింది. రూపాయి మారకం రేటు రూ.94 దాటడం ఇదే...

డాలర్‌ విలువ రూ. 94.03

  • సరికొత్త ఆల్‌టైం కనిష్ఠానికి భారత కరెన్సీ

  • క్రూడ్‌ దిగిరావడంతో మళ్లీ కోలుకున్న రూపీ

డాలర్‌ మారకంలో రూపాయి సోమవారం సరికొత్త కనిష్ఠానికి జారుకుంది. రూపాయి విలువ ఒకదశలో 50 పైసలు క్షీణించి రూ.94.03 వద్దకు చేరింది. రూపాయి మారకం రేటు రూ.94 దాటడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో యుద్ధం, ముడిచమురు ధరల ప్రభావంతో పాటు డాలర్‌ బలపడుతుండటం, యూఎస్‌ బాండ్ల రేట్లు పెరుగుతుండటం, విదేశీ పెట్టుబడుల నిరవధిక ఉపసంహర ణ, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు ఇందుకు కారణమని ఫారె క్స్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే, అంతర్జాతీయ మార్కె ట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా తగ్గడంతో కాస్తంత పుంజుకుని గత శుక్రవారం స్థాయి రూ.93.53 సమీపంలో ముగిసింది. అయితే, మున్ముందూ రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని, రూపాయి విలువ రూ.93.60-94.40 శ్రేణి లో కదలాడవచ్చని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనూజ్‌ చౌదరి అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాదికాలంలో రూ.100!?

యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి విలువ 3 శాతానికి పైగా క్షీణించింది. ముడిచమురు ధరలు దీర్ఘకాలంపాటు 90-110 డాలర్ల శ్రేణిలోనే కొనసాగితే, మన కరెన్సీ విలువ వచ్చే ఏడాది కాలంలో మరో 6.5-7.5 శాతం మేర పతనం కావచ్చని బ్రోకరేజీ సేవల సంస్థ అంబిట్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. అంటే, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.97.5-98.9 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంటోంది.

ఇవి కూడా చదవండి

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..

మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Updated Date - Mar 24 , 2026 | 02:51 AM