Share News

పసిడి ధరల్లో మరింత పారదర్శకత

ABN , Publish Date - May 05 , 2026 | 06:06 AM

దేశంలో పసిడి ధరల నిర్ధారణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు బంగారం మార్కెట్‌ను సంఘటితంగా మార్చేందుకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్‌ఈ)...

పసిడి ధరల్లో మరింత పారదర్శకత

  • ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ను ప్రవేశపెట్టిన ఎన్‌ఎ్‌సఈ

  • కొనుగోలు చేసిన రిసీట్స్‌కు సమానమైన బంగారం సెబీ అధీకృత లాకర్లలో భద్రం

న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరల నిర్ధారణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు బంగారం మార్కెట్‌ను సంఘటితంగా మార్చేందుకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్‌ఈ) సోమవారం ఎలకా్ట్రనిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌)ను ప్రవేశపెట్టింది. సెబీ నియంత్రిత, భద్రమైన, సాంకేతికంగా ఆధునిక ప్లాట్‌ఫామ్‌ ద్వారా జరిగే ఈ విలువైన లోహం క్రయ, విక్రయాలు సంప్రదాయ బులియన్‌ మార్కెట్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్‌ మధ్య అంతరాన్ని పూడ్చగలవని ఎన్‌ఎ్‌సఈ పేర్కొంది. భౌతిక బంగారంపై యాజమాన్య హక్కును కల్పించే డీమెటీరియలైజ్డ్‌ సెక్యూరిటీయే ఈజీఆర్‌. మీరు కొనుగోలు చేసే ఈజీఆర్‌ యూనిట్లను డీమ్యాట్‌ ఖాతాలో ఎలకా్ట్రనిక్‌ రూపంలో కలిగి ఉండవచ్చు. అలాగే, మీరు కొనుగోలు చేసిన ఈజీఆర్‌ యూనిట్లకు సమానమైన బంగారాన్ని సెబీ అధీకృత లాకర్లలో భద్రంగా నిల్వ చేస్తారు. ఎన్‌ఎ్‌సఈ ద్వారా ఈ యూనిట్ల క్రయ, విక్రయాలు జరిపేందుకు, తక్కువ మొత్తంలోనూ కొనుగోలు చేసే సదుపాయం ఉంటుంది. అంతేకాదు, ఎలకా్ట్రనిక్‌ రూపంలో ఉన్న మీ బంగారాన్ని అవసరమైతే లోహంగానూ మార్చుకోవచ్చు. మరో స్టాక్‌ ఎక్స్ఛేంజీ బీఎస్‌ఈ 2022 అక్టోబరులోనే ఈజీఆర్‌లను ప్రవేశపెట్టింది.

కేజీ బంగారం డీమ్యాట్‌ రూపంలోకి..

ఈజీఆర్‌ల ద్వారా పసిడి వర్తకానికి సమగ్ర, పారదర్శక వ్యవస్థను సృష్టించడం, సమర్థవంతమైన ధర నిర్ధారణ, మెరుగైన మార్కెట్‌ కార్యకలాపాలకు వీలుకల్పించడంతో పాటు జువెలర్లు, రిఫైనర్లు, వర్తకులు, ఇన్వెస్టర్లు సహా సంబంధిత వర్గాల్లో విశ్వసనీయత పెంచడమే తమ ఉద్దేశమని ఎన్‌ఎ్‌సఈ వెల్లడించింది. అలాగే, కేజీ బంగారాన్ని విజయవంతంగా డీమెటీరియలైజ్డ్‌ చేయడం జరిగిందని ఎక్స్ఛేంజీ తెలిపింది. బంగారం క్రయవిక్రయ లావాదేవీల్లో ఈజీఆర్‌ల ప్రవేశం కీలక పరిణామం కానుందని ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ (సీబీడీఓ) శ్రీరామ్‌ కృష్ణన్‌ అన్నారు.


ఈజీఆర్‌ల అవసరం ఎందుకు..?

  • దేశీయ బులియన్‌ మార్కెట్లో అసంఘటిత వాటాయే అధికం. పైగా, బంగారం ధర నగరాన్ని బట్టి మారుతుంటుంది. పసిడి నాణ్యత ధ్రువీకరణకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసినప్పటికీ, ఈ రెండు అంశాలు గోల్డ్‌ మార్కెట్లో ఇప్పటికీ విశ్వసనీయత లోపానికి కారణమవుతున్నాయి. బంగారం క్రయ, విక్రయాలను పూర్తిగా సంఘటితం చేయడంతో పాటు దేశమంతా ఒకే రేటు విఽధానాన్ని తీసుకొచ్చేందుకు ఈజీఆర్‌లు దోహదపడనున్నాయి.

  • దేశంలో డిజిటల్‌ గోల్డ్‌, ఆన్‌లైన్‌ పసిడి పథకాల్లో పెట్టుబడులు ఊపందుకున్నాయి. అయితే, అందులో అనియంత్రిత సంస్థల పథకాలే అధికం. ‘‘తమ నియంత్రణ పరిధిలోకి రాని డిజిటల్‌ గోల్డ్‌ పథకాల్లో పెట్టుబడులకు రక్షణ ఉండదని, సెక్యూరిటీస్‌ లేదా కమోడిటీ డెరివేటివ్స్‌గా గుర్తింపు లేనందున అవి సెక్యూరిటీస్‌ మార్కెట్‌ రక్షణ పరిధిలోకి రావని’’ సెబీ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే డిజిటల్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సెబీ నియంత్రిత ఈజీఆర్‌లు భద్రమైన సాధనం.

  • ఈజీఆర్‌ల ద్వారా చిన్న మొత్తంలోనూ పసిడిలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే, కంపెనీల షేర్లలాగే ఎక్స్ఛేంజీ ద్వారా సులభంగా ఈ యూనిట్ల క్రయవిక్రయాలు చేపట్టవచ్చు.

ఈ వార్తలూ చదవండి:

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జోరు.. సన్ టీవీ షేర్లు పతనం..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 05 , 2026 | 06:06 AM