Share News

బులియన్‌ కుదేల్‌..

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:41 AM

బులియన్‌ మార్కెట్‌పై ‘బేర్‌’ పట్టు కొనసాగుతోంది. శుక్రవారం బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి...

బులియన్‌ కుదేల్‌..

  • ఏడాది కనిష్ఠానికి 10 గ్రా. పసిడి ధర

  • రూ.1.3 లక్షల దిగువకు చేరిక

  • వెండి కేజీ రూ.1.6 లక్షల కిందకు

న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్‌పై ‘బేర్‌’ పట్టు కొనసాగుతోంది. శుక్రవారం బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.5,200 నష్టపోయి ఏడాది కనిష్ఠ స్థాయి రూ.1,29,300 వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరిలో నమోదైన రూ.1.83 లక్షల జీవితకాల గరిష్ఠ స్థాయితో పోలిస్తే పసిడి ధర ఇప్పటి వరకు 29.3 శాతం (రూ.53,700) నష్టపోయింది. పసిడితో పోలిస్తే వెండి ధర మరింత దారుణంగా పడిపోయింది. శుక్రవారం కిలో వెండి ధర మరో రూ.4,000 నష్టపోయి రూ.1.58 లక్షల వద్ద ముగిసింది. ఈ నెల 5వ తేదీతో పోలిస్తే కిలో వెండి ధర ఇప్పటి వరకు రూ.36,500 (19 శాతం) నష్టపోయింది. ఈ ఏడాది జనవరిలో నమోదైన జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.4.04 లక్షలతో పోలిస్తే మాత్రం 61 శాతం (రూ.2.46 లక్షలు) నష్టపోయింది. గత ఏడాది ఆగస్టు తర్వాత దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఈ స్థాయికి దిగి రావడం ఇదే మొదటిసారి. బంగారం, వెండి ధరలు నష్టాలతో ముగియడం వరుసగా ఇది తొమ్మిదో రోజు. అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్లోనూ బులియన్‌ మార్కెట్‌ పతనం కొనసాగుతోంది. శుక్రవారం ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం, వెండి ధరలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ‘ఈ వారం డాలర్‌తో మన రూపాయి మారకం రేటు 1.5 శాతం పెరిగింది. దీంతో పసిడి ధర పతనం మరింత ఊపందుకుంది. వెండి ధరల పతనానికి అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయనే వార్తలు ప్రధాన కారణం.’ అని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ సంస్థ కమోడిటీస్‌ విభాగం సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ చెప్పారు.

ఎందాక ఈ పతనం?

ఈ ఏడాది జనవరిలో నమోదైన రికార్డు ధరలతో పోలిస్తే ఇప్పటి వరకు పసిడి ధర 30 శాతానికి పైగా, వెండి ధర దాదాపు 61 శాతం పడిపోయాయి. గత వారం రోజుల్లోనే పసిడి ధర 9 శాతం, వెండి ధర 18 శాతం నష్టపోయాయి. ఈ పతనం ఇలానే కొనసాగితే త్వరలోనే దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1.2 లక్షలు, కిలో వెండి ధర రూ.1.5 లక్షలకు దిగి వచ్చే అవకాశం ఉందని ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ (ఐబీజేఎ) అంచనా. రూ.1.2 లక్షలకు దిగువకు వస్తే మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.లక్ష దిగువకు వచ్చినా ఆశ్చర్యం లేదనే అంచనాలూ వినిపిస్తున్నాయి. అయితే పెట్టుబడి లాభాల కోసం చూసే మదుపరులు రూ.1.2 లక్షల నుంచి పొజిషన్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నార


పతనానికి కారణాలు

  • ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్‌ మారకం రేటు 19 నెలల గరిష్ఠ స్థాయికి చేరడం

  • ధరల సెగను కట్టడి చేసేందుకు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశా ల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లు పెంచుతా యనే అంచనాలు

  • అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై పెరుగుతున్న వడ్డీ రాబడులు

  • డిసెంబరులో జరిగే సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును ఏకంగా అర శాతం పెంచుతుందనే వార్తలు

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 05:42 AM