బులియన్ మార్కెట్ కుదేలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 03:02 AM
గురువారం బులియన్ మార్కెట్ కూడా ‘బేర్’ పట్టులోకి జారుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా రూ.17,800 (7%) నష్టపోయి...
పసిడి రూ.7,000.. వెండి రూ.17,800 పతనం
న్యూఢిల్లీ: గురువారం బులియన్ మార్కెట్ కూడా ‘బేర్’ పట్టులోకి జారుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా రూ.17,800 (7%) నష్టపోయి రూ.2,38,700కి పడిపోయింది. 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) పసిడి ధర సైతం రూ.7,000 (4.37%) నష్టపోయి రూ.1,53,300 వద్ద ముగిసింది. ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు వెలవెలబోతున్నాయి. గురువారం ఎంసీఎక్స్‌లో వచ్చే నెల డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి పసిడి రూ.3,616 (2.36ు) నష్టపోయి రూ.1,49,409 వద్ద ముగిసింది.
ఎగిసి ‘పడిన’ మార్కెట్
ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి రూ.4,04,500కు, 10 గ్రాముల పసిడి రూ.1.83 లక్షలకు చేరి రికార్డు సృష్టించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే కిలో వెండి ధర 41% (రూ.1,65,800), పసిడి ధర 16.23% (రూ.29,700) తగ్గాయి.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..