Share News

8 రోజుల్లో రూ.12,400 తగ్గిన బంగారం

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:44 AM

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింతగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర గురువారం...

8 రోజుల్లో రూ.12,400 తగ్గిన బంగారం

వెండిదీ అదే బాట

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింతగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.1,300 తగ్గి రూ.1,34,500కు చేరుకుంది. వరుసగా ఎనిమిదో రోజూ పసిడి ధర తగ్గింది. ఈ నెల 9వ తేదీ నుంచి బంగారం ధర ఏకంగా రూ.12,400 పడిపోయింది. బంగారం బాటలోనే వెండి సాగుతోంది. గురువారం కిలో వెండి ధర రూ.2,500 తగ్గి రూ.1,62,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రెండు లోహాల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లోనూ ధరలు పతనమవుతున్నాయి. రూపాయి బలపడుతుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) స్పాట్‌ బంగారం ధర ఒక దశలో 3,717.57 డాలర్లు, వెండి 44.92 డాలర్ల వద్ద ట్రేడయింది.

ఈ వార్తలు కూడా చదవండి

సర్కారు బ్యాంకులకు లాభాల పంట

Updated Date - Nov 20 , 2026 | 05:44 AM