నగ వెలవెల!
ABN , Publish Date - May 23 , 2026 | 05:48 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో స్వర్ణాభరణాల రిటైల్ విక్రయాల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 13-15 శాతం మేర తగ్గి 620-640 టన్నులకు పరిమితం...
క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జువెలరీ
విక్రయాలు 13-15 శాతం తగ్గొచ్చు..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో స్వర్ణాభరణాల రిటైల్ విక్రయాల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 13-15 శాతం మేర తగ్గి 620-640 టన్నులకు పరిమితం కావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గరిష్ఠ స్థాయి ధరలు, దిగుమతి సుంకం పెంపు ఇందుకు కారణం కానున్నాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బంగారు నగల రిటైల్ విక్రయాల పరిమాణం అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోలిస్తే 8 శాతం తగ్గింది. కాగా, 2026-27లో ఆభరణాల రంగ ఆదాయం 20-25 శాతం మేర పెరగవచ్చని, అధిక ధరలు ఇందుకు దోహదపడనున్నాయని నివేదికలో ప్రస్తావించింది. అంతేకాదు, అధిక ధరల కారణంగా జువెలర్స్‌కు నగల నిల్వల నిర్వహణ ఖర్చు, బ్యాంక్ నుంచి రుణాల సమీకరణ కూడా పెరగనుందని క్రిసిల్ అంటోంది. అయినప్పటికీ, ఆదాయం, నగదు లభ్యత పెరుగుదల రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించనుందని, తత్ఫలితంగా జువెలరీ కంపెనీల పరపతి రేటింగ్ నిలకడగా కొనసాగవచ్చని పేర్కొంది.
బంగారం డిమాండ్ 50-60 టన్నుల మేర తగ్గొచ్చు: డబ్ల్యూజీసీ
దిగుమతి సుంకం పెంపు కారణంగా ఈ ఏడాది భారత్‌లో పసిడి గిరాకీ 50-60 టన్నుల మేర తగ్గవచ్చని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 10ుతక్కువ.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్