Share News

మ్యూచువల్‌ ఫండ్‌ ఆదాయంపై పన్ను మార్పులు

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:27 AM

షేర్లపై లభించే డివిడెండ్‌ ఆదాయం లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల నుంచి లభించిన ఆదాయానికి సంబంధించి ఏదైనా వడ్డీ వ్యయంపై పన్ను మినహాయింపును...

మ్యూచువల్‌ ఫండ్‌ ఆదాయంపై పన్ను మార్పులు

షేర్లపై లభించే డివిడెండ్‌ ఆదాయం లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల నుంచి లభించిన ఆదాయానికి సంబంధించి ఏదైనా వడ్డీ వ్యయంపై పన్ను మినహాయింపును రద్దు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయం పన్ను చట్టం 2025లో ఈ మార్పు భాగం కానుంది. ప్రస్తుతం ఈ రెండు ఆదాయాల్లో 20 శాతం వరకు వడ్డీ వ్యయం కింద మినహాయించుకునే వెసులుబాటు ఉంది. తాజా మార్పుతో అప్పు చేసి షేర్లు లేదా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారిపై పన్ను భారం పెరగనుంది.

ఇవీ చదవండి:

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

Updated Date - Feb 02 , 2026 | 06:27 AM