షేర్ల బైబ్యాక్‌పై పన్ను నిబంధనల్లో మార్పులు
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:39 AM
కంపెనీలు సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసే సమయంలో మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను రక్షించడంతో పాటు ప్రమోటర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు...
కంపెనీలు సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసే సమయంలో మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను రక్షించడంతో పాటు ప్రమోటర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఆర్థిక మంత్రి ఈసారి బడ్జెట్లో పన్ను నిబంధనల్లో సమూల మార్పులు ప్రకటించారు. ఇకపై ప్రమోటర్ల పరిధిలోకి రాని అన్ని విభాగాల షేర్‌హోల్డర్ల బైబ్యాక్ రాబడులపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను వసూలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5 శాతంగా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20 శాతంగా ఉంది. బైబ్యాక్‌లో తమ వాటా విక్రయించే ప్రమోటర్లు మాత్రం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని సీతారామన్ స్పష్టం చేశారు. కార్పొరేట్ ప్రమోటర్లపై పన్ను రేటు 22 శాతంగా, నాన్ కార్పొరేట్ ప్రమోటర్లపైౖ పన్ను రేటు 30 శాతంగా ఉండనుంది. కంపెనీ ప్రమోటర్లు తమ ఈక్విటీ వాటాల రాబడులపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు బైబ్యాక్‌లను ఉపయోగించుకోకుండా నివారించడమే ఈ మార్పుల ఉద్దేశం. అలాగే, బైబ్యాక్‌లో షేర్లను విక్రయించే చిన్న, సాధారణ షేర్‌హోల్డర్లకు లబ్ది చేకూరనుంది. ఎందుకంటే, ప్రస్తుతం బైబ్యాక్ రాబడులను డివిడెండ్‌గా పరిగణించి, 35 శాతం వరకు పన్ను విధిస్తోంది కేంద్రం. తాజా మార్పుతో వీరికి బైబ్యాక్ రాబడులపై పన్ను భారం దీర్ఘకాలిక (కనీసం3 ఏళ్లు) పెట్టుబడిపై 12.5 శాతానికి, స్వల్పకాలిక (1-3 ఏళ్లు) పెట్టుబడిపై 20 శాతానికి తగ్గనుంది.
ఇవీ చదవండి:
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..