ప్రవాసుల ‘ఈక్విటీ’ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:42 AM
భారత క్యాపిటల్ మార్కెట్లో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), భారత సంతతి ప్రజల (పీఐఓ) నేరుగా పెట్టుబడులు పెంచేందుకూ కేంద్ర బడ్జెట్ చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు...
వ్యక్తిగత పరిమితి 5 నుంచి 10 శాతానికి పెంపు
భారత క్యాపిటల్ మార్కెట్లో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), భారత సంతతి ప్రజల (పీఐఓ) నేరుగా పెట్టుబడులు పెంచేందుకూ కేంద్ర బడ్జెట్ చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు వీరు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) రూపంలో లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. తాజాగా వీరు నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో లిస్టెడ్ కంపెనీల ఈక్విటీలో వీరి వ్యక్తిగత పెట్టుబడి పరిమితి 5 శాతం వరకు ఉంది. తాజాగా దీన్ని 5 నుంచి 10 శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. అలాగే ఒక లిస్టెడ్ కంపెనీ ఈక్విటీలో ఎన్‌ఆర్‌ఐలు, పీఐఓల పెట్టుబడుల మొత్తం పరిమితిని ప్రస్తుత 10 శాతం నుంచి 24 శాతానికి పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. కాకపోతే వీరు తమ పెట్టుబడులను పోర్టుఫోలియో ఇన్వె్‌స్టమెంట్ స్కీమ్ (పీఐఎస్) ద్వారా మాత్రమే చేయాలి. నమోదిత స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేసే షేర్లు, కన్వర్టబల్ డిబెంచర్లకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది. ఈ చర్య దేశీయ స్టాక్ మార్కెట్‌తో పాటు రూపాయి మారకం రేటులోనూ స్థిరత్వం తెస్తుందని భావిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ, పీఐఓలు ఇప్పటి వరకు ఫెమా నిబంధనలకు అనుగుణంగా గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. ఇకపై వీరు ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ లేకుండా కేవైసీ నిబంధనలు, బ్యాంకింగ్ చానల్స్ ద్వారా భారత ఈక్విటీల్లో పెట్టుబడులు అవకాశం లభించనుంది. ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ రానున్న వారాల్లో పూర్తి స్థాయి మార్గదర్శకాలను జారీ చేయనుంది.
ఇవీ చదవండి:
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..